China: భారత్, చైనా కలిసి పనిచేస్తే ఉపయుక్తం..! 1 y ago
తాము భారతదేశంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ సంచలనవ్యాఖ్యలు చేశారు. శతృత్వం కంటే పరస్పర విజయం కోసం పాటుపడితే ప్రయోజనకరమన్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై స్పందిస్తూ.. రెండు ఆసియా దిగ్గజ దేశాలు చేతులు కలపాల్సిన ఆవశ్యకత ఉందని వాంగ్ యీ నొక్కి చెప్పారు. చర్చలు, సహకార భావనతో వివాదాలు పరిష్కరించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.